కార్యకర్తల కంటతడి..!
– పైలెట్ ముందు అభిమానుల ఆవేధన
– అందరికి ఓదార్చి ధైర్యం చెప్పిన రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని తాజా మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో సానుభూతి పర్వం ఏర్పడింది. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పైలెట్ రోహిత్ రెడ్డి ఓటమి పాలు కావడంతో పలువురు నేతలు, కార్యకర్తలు రోహిత్ రెడ్డి ముందు భావోద్వానికి గురయ్యారు. సర్పంచులు, ఎంపీటీసీలు సైతం కన్నీరు పెట్టుకున్నారు. తాండూరు మండలంలోని సంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత బక్కప్ప రోహిత్ రెడ్డిని పట్టుకుని ఏడ్చేశారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన మహిళ కార్యకర్త కంటతడి పెట్టారు. తాండూరు మంచి నాయకున్ని ఓడించిందని ఆవేధన వ్యక్త పరిచారు.
ఇలా పలువురు నేతలు, కార్యకర్తలు భావోద్వానికి గురికావడంతో పైలెట్ రోహిత్ రెడ్డి అందరిని ఓదార్చారు. ఎవ్వరు ఆధైర్య పడొద్దని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అందరం కృషి చేద్దామన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామన్నారు. తాండూరును వదిలేదని, నేతలు, కార్యకర్తలందరికి అందుబాటులో ఉంటానని అన్నారు.
ఇది కూడా చదవండి…

