పరీక్షకు హాజరైన పెండ్లి కూతురు
– సోషల్ మీడియాలో వీడియో వైరల్
దర్శిని బ్యూరో: కొన్ని గంటల్లోనే పెళ్లి జరగబోతుండగా ఆ పెండ్లి కూతురు పరీక్షను ఎదుర్కొంది. అందంగా ముస్తాబైన పెళ్లి దుస్తుల్లోనే తను రాయబోయే పరీక్షకు హాజరయ్యింది. పెళ్లిరోజే పరీక్షకు హాజరైన పెళ్లి కూతురు విడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కి చెందిన శివంగి బగ్థారియా అనే పెళ్లి కూతురు పెళ్లి దుస్తులు ధరించి పరీక్ష హాలుకు రాగానే పరీక్ష రాసే తోటి అభ్యర్థులు ఆశ్చర్యపోయారు. అయితే వివాహం రోజే పరీక్ష ఉండటంతో ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఆమె పరీక్ష రాయగలిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. తమకు పెళ్లి కంటే చదువు ముఖ్యమని శివంగి బగ్తారియా చెప్పారు. ఇప్పటికే ఈ వీడియోను 5 లక్షలకుపైగా మంది వీక్షించారు. అయితే శివాంగి ఇలా పెళ్లి కంటే పరీక్షలపై దృష్టి పెట్టడం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా మారింది. చాలా మంది అమ్మాయిలు పెళ్లి కారణంగా చదువును మధ్యలోనే నిలిపివేస్తున్నారు. అమ్మాయిలకు తల్లిదండ్రులు పెళ్లి చేసేందుకు నిర్ణయించి సంబంధాలు కుదుర్చుకోవడంతో వారి చదువులకు ఆటంకం ఏర్పడుతుంది. కానీ చాలా మంది శివాంగి సెంటిమెంట్‌ని మెచ్చుకున్నారు.
https://www.instagram.com/tv/CWlm0HCK1LV/?utm_source=ig_web_copy_link