హస్తం గూటికి సందీప్ రెడ్డి

తాండూరు రాజకీయం వికారాబాద్

హస్తం గూటికి సందీప్ రెడ్డి
– ఆహ్వానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీకి చెందిన పట్లోళ్ల సందీప్ రెడ్డి హస్తం గూటికి చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సందీప్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సందీప్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వార్డులో ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలని సూచించారు. సందీప్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాలతో పార్టీ గెలుపుకోసం పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సర్దార్ ఖాన్, గాజుల మాధవి, సత్యమూర్తి, భరత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేత