పేదలకు వరం సీఎంఆర్ఎఫ్

తాండూరు రాజకీయం వికారాబాద్

పేదలకు వరం సీఎంఆర్ఎఫ్
-రూ. 4.35ల‌క్ష‌ల ఎల్వోసీలను అందజేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న సీఎంఆర్ఎఫ్ పథకం వారికి వరంలా మారిందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. తాండూరు నియోజకవర్గంలోని ఇద్దరి లబ్దిదార్థులకు రూ. 1.85 లక్షలు సీఎంఆర్ఎఫ్ కింద చెక్కులు మంజూరయ్యాయి. సోమవారం తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పట్టణానికి చెందిన విజయ్ కుమార్క రూ.60వేలు, పాషామియాకు రూ. 1.25 లక్షలు, తాండూరు మండ‌లం క‌ర‌ణ్‌కోట్ గ్రామానికి చెందిన స్వాతికి రూ. 2 ల‌క్ష‌లు, చెన్‌గెష్ పూర్ గ్రామానికి చెందిన గుండ‌ప్ప‌కు రూ. 40 వేల విలువైన ఎలిసీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక చేయూతనందిస్తుందని అన్నారు. ఈ పథకం పేదలకు వరంగా మారిందన్నారు. అనారోగ్యంతో ఉన్న వారు సీఎంఆర్ఎఫ్ సహాయం కోసం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), సీనీయర్ నాయకులు రాజుగౌడ్, పబ్లిళ్ల నర్సింలు, శ్రీనివాస్ వారి. యువనాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.