కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేత
– ఆహ్వానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాండూరు పట్టణం 11వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పటేల్ తేజ(చంద్రకాంత్ రెడ్డి) శుక్రవారం కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పటేల్ తేజకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని సూచించారు. పటేల్ తేజ మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆదేశాలతో పార్టీ గెలుపుకోసం పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బంటు వేణు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

