పాత నేరస్తులపై పోలీసుల నిఘా

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

పాత నేరస్తులపై పోలీసుల నిఘా
– తాండూరులో ముమ్మర తనిఖీలు
– ప్రత్యేక పరికరం ద్వారా చెకింగ్‌లు
– పాల్గొన్న డీఎస్పీ నర్సింగ్ యాదయ్య
తాండూరు, దర్శిని ప్రతినిధి : పాత నేరస్తులపై పోలీసులు పర్యవేక్షణ తనిఖీలు చేపట్టారు. మంగళవారం వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాల మేరకు తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు చేశారు.

తాండూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్‌లతో పాటు పరిసర ప్రాంతాలలో ఈ తనిఖీలు కొనసాగాయి. అనుమానిత వ్యక్తులను పరిశీలించి ప్రత్యేక పాపులన్‌ డివైస్(పరికరం) ద్వారా వేలి ముద్రలను సేకరించి వివరాలను ఆరా తీసే చర్యలు చేపట్టారు. వ్యక్తులనే కాకుండా అనుమానిత వ్యక్తులకు సంబంధించిన బ్యాగులను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ ప్రజల శాంతి భద్రతల దృష్ట్యా తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా పాత నేరస్తులను గుర్తించి వారి కదలికలపై నిఘా ఉంచడం జరగుతుందని అన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. ఈ తనిఖీలలో తాండూరు పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్, ఎస్ఐలు అంబర్య, సాజిద్, యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి, కానిస్టేబుళ్లు సిబ్బంది ఉన్నారు.

వచ్చే నెల 2నుంచి విఠలేశ్వర స్వామి జాతర