బీఆర్ఎస్, బీజేపీ నేతల అరెస్ట్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్ఎస్, బీజేపీ నేతల అరెస్ట్..!
– పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలింపు 
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు చెందిన బీఆర్ఎస్, బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

సోమవారం తాండూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే రైతు వారోత్సవాలకు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరవుతున్న స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పర్యటనను అడ్డుకుంటారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

బీజేపీ ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం, 33వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ ముదిరాజ్, రజనీకాంత్‌, బీఆర్ఎస్ నాయకులు ఎజాజ్ లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. వారిని పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పట్టణంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ని అక్రమ అరెస్టులు చేసిన ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం ఆగదని అన్నారు.

 

పేదల కోసం కాంగ్రెస్ దేనికైనా సిద్దం