కాంగ్రెస్ సర్కారుకు గుణపాఠం తప్పదు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ సర్కారుకు గుణపాఠం తప్పదు
– అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం
– తాండూరు బీఆర్ఎస్వీ నేతలు
– ముందస్తు అరెస్టులు చేసిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు, యువత గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆర్ఎస్వీ నేతలు అన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్, పథకాల అమలులో వైఫల్యాలపై బీఆర్ఎస్వీ చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం తాండూరుకు చెందిన బీఆర్ఎస్వీ అధ్యక్షులు జోగుల ఎబినేజర్, జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయరావు, పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి తదితరులను స్థానిక పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్భంద పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. అంకెల గారడిగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో మోసాలకు పాల్పడుతుందని అన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఏవీ సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు. మహిళలు, రైతులు, యువకులు, నిరుద్యోగులను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కారుకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. అరెస్టులతో ఉద్యమాలను, వ్యతిరేకతను ఆపలేరని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన నేతలను విడుదతల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు అయిన వారిలో నాయకులు రజక నర్సింహా, వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ఫోన్ పే, జీ పేలకు యూపీఐ సేవలు క్యాన్సల్..!