దొరికిన బంగారం దొంగ..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

దొరికిన బంగారం దొంగ..!
– 24గంటల్లో చేధించిన పోలీసులు
– 4 తులాల ఆభరణాల రికవరి
– నిందితుడిని రిమాండుకు తరలింపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాళం వేసిన ఇంట్లో బంగారం చోరీ అయిన ఘటనలో పోలీసులు దొంగను పట్టుకున్నారు.

24 గంటల్లోనే కేసును చేధించిన పోలీసులు ఆభరణాలను రికవరీ చేసి.. దొంగను రిమాండుకు తరలించారు. తాండూరు పట్టణ సీఐ పరమేశ్వర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం పుటాన్‌ గల్లికి చెందిన మామిడి రాజన్న కర్ణాటక రాష్ట్రం చించొల్లిలో జరిగిన తెలిసిన వారి పెళ్లికి వెళ్లారు.

తిరిగి ఈనెల 20వ తేదిన ఇంటికి వచ్చారు. ఇంట్లో బీరువాలో ఉన్న లాకర్‌లో బంగారం నెక్లెస్, కమ్మలు, పుస్తె, చెవి దుద్దులు మొత్తం 4 తులాల బంగారు ఆభరణాలు గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారని నిర్దారించుకున్నారు. వెంటనే పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించగా నిందితున్ని గుర్తించారు.

చింతపల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు నిందితుడి వద్ద నుంచి చోరీకి గురైన బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి సోమవారం న్యాయస్థానంలో హాజరు పరిచి రిమాండుకు తరలించినట్లు పట్టణ సీఐ పరమేశ్వర్ తెలిపారు.

బూమర్ తింటున్నాడని బెత్తం దెబ్బ