అల్పపీనం ఎఫెక్ట్..!

తాండూరు తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

అల్పపీనం ఎఫెక్ట్..!
– 5 రోజులు భారీ వర్షాలు
– వాతావరణ కేంద్రం హెచ్చరిక
హైదారాద్, దర్శిని ప్రతినిధి : రాగల 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలంగా మారుతున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. రేపటికి ఈ అల్పపీడనం తీవ్రరూపం దాల్చే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మంగళవారం ఉదయం నాటికి మధ్యబంగాళాఖాతం చేరే అవకాశం ఉందని చెప్పింది. ఆ తర్వాత రెండురోజుల్లో మరింత ముందుకు కదులుతూ పశ్చిమ వాయువ దశగా కదులుతూ తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఏపీ తీరాలకు చేరే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో ఈ రోజు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, కరీంనగర్‌, పెద్దపల్లి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

మంగళవారం నిర్మల్‌, నిజామాబాద్‌, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు కురుస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

ఇదికూడా చదవండి…

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరగొద్దు..!