యువకుడిపై బాలుడి కత్తి వేటు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

యువకుడిపై బాలుడి కత్తి వేటు..!
– రెండు సార్లు దాడిచేసిన వైనం
– బషీరాబాద్ మండలంలో ఘటన
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : మాట మాట పెరిగి ఇద్దరి మధ్య వివాదానికి దారితీసింది. చివరకు కత్తి దాడికి దారితీసింది. బషీరాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

జయంతి కాలనీకి చెందిన సచిన్, అదే కాలనీకి చెందిన 17 ఏళ్ల బాలుడు ఓ ఇద్దరు స్నేహితులు. బాలుడు మద్యం సేవిస్తున్నాడని సచిన్ ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అనంతరం సచిన్‌కు, బాలుడి తల్లికి మధ్య కూడా వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఇంతలో కోపోద్రిక్తుడైన బాలుడు కత్తితో సచిన్‌పై దాడి చేశాడు. వెన్ను భాగంలో రెండుసార్లు గాయాలు కావడంతో సచిన్‌ను తాండూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

పిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విఠల్ తెలిపారు.

 

కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ లకు బ్రేక్..!