రాజన్నతో రక్షా బంధం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రాజన్నతో రక్షా బంధం..!
– బాలికల వసతి గృహంలో రాఖీ పండగ
– రాజ్‌కుమార్‌కు రాఖీలు కట్టిన విద్యార్థినులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: అమ్మా నాన్నలు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ వసతి గృహాల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినులకు రాఖీ పండగ ఓ మధుర జ్ఞాపకంగా మారింది.

తాండూరులోని బాలికల వసతి గృహంలో రక్షా బంధన్ వేడుకలను ఆత్మీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నేత కందుకూరి రాజ్‌కుమార్‌కు విద్యార్థినులు రాఖీలు కట్టి అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. కుటుంబానికి దూరంగా ఉంటున్న విద్యార్థినులకు ఒక అన్నగా అండగా నిలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

విద్యార్థినులు కట్టిన రాఖీ కేవలం పండుగకు గుర్తు మాత్రమే కాదని, ఆత్మీయత, నమ్మకం, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అని పేర్కొన్నారు.రక్త సంబంధం లేకపోయినా మనసుతో ఏర్పడే అన్నాచెల్లెళ్ల బంధం ఎంతో గొప్పదని అన్నారు. ప్రతి ఆడబిడ్డకు అండగా నిలిచి, వారి భద్రత, భవిష్యత్తుకు తోడ్పడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

రాఖీ పండగ సందర్భంగా విద్యార్థినులకు రాజ్‌కుమార్ చిన్నచిన్న కానుకలను అందజేశారు. దీంతో వసతి గృహంలో పండగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

అయ్యో పాపం లక్ష్మీ..!