భద్రేశ్వరుని సేవలో..!

తాండూరు రాజకీయం వికారాబాద్

భద్రేశ్వరుని సేవలో..!
– నిజామాబాద్‌ ఏఎస్పీ మధుసూధన్ రావు
– స్వాగతించిన బీసీ సంఘం నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో ప్రసిద్ది చెందిన భావిగి భద్రేశ్వరుని సేవలో నిజామాబాద్ అడిషనల్ ఎస్పీ(ఏఎస్పీ) మధుసూధన్ రావు తరించారు. ఆదివారం తాండూరుకు వచ్చిన ఏఎస్పీ మధుసూధన్ రావుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు స్వాగతం తెలిపారు. అనంతరం ఏఎస్పీ తాండూరులోని భద్రేశ్వరాలయాన్ని సందర్శించారు.

జాతర ఉత్సవాల సందర్భంగా ఆలయంలో వెలసిన భద్రేశ్వరున్ని ఏఎస్పీ మధుసూధన్‌ రావు దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఏఎస్పీకి ఆలయ పూజారులు, సభ్యులు సాదరంగా స్వాగతం పలికి అర్చక, దీప సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకుర్, రాము ముదిరాజ్, ఎస్పీ రవికాంత్, హరి గౌడ్ , నరసింహ, దావులయ్య, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.