పాలనలో వైఫల్యం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పాలనలో వైఫల్యం..!
– పారిశుధ్యం అస్తవ్యస్తం
– వాహనాలు, డీజిల్ లెక్కలు తేల్చాలి
– బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ డిమాండ్
– పాలకవర్గ తీరుపై ఫైర్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పాలక వర్గం పూర్తిగా వైఫల్యం చెందిందని, పారిశుద్ధ్య అస్తవ్యస్తంగా మారిందని బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ విమర్శించారు.

శనివారం మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో చెత్త సేకరణ, తరలింపు పనులు సక్రమంగా జరగడం లేదని ఆయన అన్నారు. పారిశుద్ధ్య పనులకు అవసరమైన వాహనాలు, జేసీబీలు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతోందని అన్నారు.

సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పారిశుద్ధ్య వాహనాలకు డీజిల్, శానిటేషన్ కాంట్రాక్టర్లు, సిబ్బంది తదితర అంశాలకు సంబంధించిన వివరాలను మున్సిపల్ అధికారులు స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా మున్సిపల్ అధికార పాలక వర్గం పట్టణ అభివృద్ధిలో వైఫల్యం చెందిందని విమర్శించారు. రాజకీయ విమర్శలపై పెట్టిన శ్రద్ధ అభివృద్ధిపై పెట్టడం లేదని మండిపడ్డారు. పంతాలను మానుకుని ప్రగతిపై పెట్టాలి అని హితవు పలికారు. లేదంటే ప్రజలు ఉద్యమించక తప్పదని హెచ్చరించారు.

ఘనంగా శంకర్ యాదవ్ జన్మదిన వేడుకలు