చిన్నారి ఊయల వేడుకలో బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి

తాండూరు రాజకీయం వికారాబాద్

చిన్నారి ఊయల వేడుకలో బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి
– ఆశీర్వదించి.. తల్లిదండ్రులకు శుభాకాంక్షలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఆర్బీఓఎల్ ఎండి బుయ్యని సరళా రెడ్డి శుభకార్యంలో సందడి చేశారు.

బుధవారం తాండూరు పట్టణానికి చెందిన యువ నాయకుడు బీడే లోకేష్‌కుమార్‌–లహరి దంపతుల కుమార్తె ఊయల వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఆర్‌బీఓఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బుయ్యని సరళారెడ్డి పాల్గొన్నారు.

చిన్నారిని చేతుల్లోకి తీసుకున్నారు. చిన్నారిని ఆప్యాయంగా ఆశీర్వదించి, ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలో ఆత్మీయంగా పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, విద్యావేత్త పర్యాద రామకృష్ణ, నాయకులు రాజుగౌడ్, అకింత్ అనురాగ్, వికాష్ జోషి తదితరులు ఉన్నారు.

ఎన్నికలకు సిద్ధమైన తాండూరు ఆర్టీసీ..