ఖైరతాబాద్ స్థానంపై గెజిట్ జారీ
– ప్రకటించిన తెలంగాణ శాసన సభ
– ఉప ఎన్నిక ప్రక్రియపై పెరిగిన ఆసక్తి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధ : ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్లు తెలంగాణ శాసనసభ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి సెప్టెంబర్ 28న గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఆయనపై అనర్హత వేటు వేస్తూ, 2024 ఏప్రిల్ 23 నుంచి అనర్హత వర్తిస్తుందని పేర్కొంది.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సెప్టెంబర్ 24న అత్యున్నత న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ప్రకటించే ప్రక్రియకు మార్గం సుగమమైంది.

తాజా గెజిట్‌తో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక నిర్వహణకు సంబంధించిన తదుపరి ఎన్నికల ప్రక్రియపై ఆసక్తి నెలకొంది. అధికారిక షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంది.


