మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
– సత్యనారాయణ బూబ్ కు నివాళులు
– విషాద కుటుంబానికి ఓదార్పు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ ప్రముఖ వ్యాపారవేత్త, గోశాల, టీఆర్సీ క్లబ్ వ్యవస్థాపకుడు సత్యనారాయణ బూబ్ అకాల మృతిపై తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. విషాద సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

అనంతరం వారం రోజుల క్రితం ఉప్పరి అనంతరాములు కుమార్తె మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి వారి నివాసానికి వెళ్లారు.

కుటుంబ సభ్యులను పరామర్శించి, ఘటనపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేస్తూ మనోధైర్యం కల్పించారు. ఎమ్మెల్యే వెంట మునిసిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, ఎస్ఐఆర్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు, నాయకులు రవీందర్ గౌడ్, పట్లోల్ల బాల్ రెడ్డి, అబ్దుల్ రావుఫ్, మురళి గౌడ్, నేతలు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.


