ఇందిరమ్మ బీమాకు యాప్..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ఇందిరమ్మ బీమాకు యాప్..!
– రేపటి నుంచి ప్రత్యేక నమోదు కార్యక్రమాలు
– కుటుంబ యజమాని ఆధార్‌, ఫోన్‌ నంబర్‌ వివరాలు తప్పనిసరి
– విధానాల అమలుపై కసరత్తు
తాండూరు, దర్శిని ప్రతినిధి: అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పథకాన్ని అమలు చేయనుంది. రేపటి నుంచి పథకం నమోదు ప్రక్రియ ప్రారంభం కానుండగా, ఇందుకోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

18 నుంచి 59 ఏళ్లలోపు అర్హులైన వారికి ఈ పథకం వర్తించనుంది. ప్రారంభమైన నెల రోజుల్లోగా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ యాప్‌లో రేషన్‌ కార్డు ఆధారంగా కుటుంబ వివరాలను నమోదు చేస్తారు. కుటుంబ యజమాని ఆధార్‌ కార్డు, ఫోన్‌ నంబర్‌ వివరాలను పరిశీలించి, భార్యను నామినీగా నమోదు చేయాలి.

నామినీ పేరు నమోదు చేసిన అనంతరం కుటుంబ యజమాని దరఖాస్తు ఫారాన్ని యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ప్రతి గ్రామపంచాయతీకి ప్రత్యేక లాగిన్‌ ఏర్పాటు చేయనుండగా, పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులకు మాత్రమే ఆన్‌లైన్‌ నమోదు సదుపాయం కల్పించనున్నారు. ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీ నమోదు కాకపోతే జూలై 1వ తేదీని ప్రామాణికంగా తీసుకోనున్నారు. పట్టణ ప్రాంతాల్లో నేరుగా వివరాల నమోదు, గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా ప్రక్రియ చేపట్టనున్నారు.

రేషన్‌ కార్డులు లేని అర్హులైన కుటుంబాలకు కూడా పథకం ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఈ నెల 19 నుంచి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, శిబిరాలు నిర్వహించి అర్హులైన ప్రతి కుటుంబం వివరాలు నమోదు చేసేలా చర్యలు చేపట్టనున్నారు.

ఇంట్లోనే డ్రైవింగ్‌ లైసెన్స్‌ పరీక్ష..!