రామయ్య కూతురుకు రూ. 2లక్షల సీఎం సహాయ నిధి

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

రామయ్య కూతురుకు రూ. 2లక్షల సీఎం సహాయ నిధి
– ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాకారంతో కుటుంబానికి అండ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో పట్టణంలోని నిరుపేద కుటుంబానికి సీఎం సహాయ నిధి అండగా నిలిచింది. దీంతో బాధిత కుటుంభీకులు సర్కారుకు, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళితే తాండూరు పట్టణం వెంకటేశ్వర కాలనీకి చెందిన రామయ్య కూతురు సరస్వతి గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో కుటుంభీకులు ఆమెకు ఖరీదైన వైద్యం చేయించారు. ఇందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి విషయాన్ని తెలిపారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేయించారు.
ప్రభుత్వం రామయ్య కూతురు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి కింద రూ. 2లక్షలు మంజూరు చేసింది. గురువారం రాత్రి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రామయ్య కుటుంబానికి రూ.2లక్షల సీఎం సహాయ నిధి ఎల్ఓసీని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పథకం పేదలకు ఆర్థిక భరోసా అందిస్తుందని పేర్కొన్నారు. వైద్యం చేయించుకోలేని పేదలు సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.