శ్రీ శ్రీ‌దేవి భూదేవి శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌య వార్షికోత్స‌వాలు

తాండూరు వికారాబాద్

శ్రీ శ్రీ‌దేవి భూదేవి శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌య వార్షికోత్స‌వాలు
– నేటి నుంచి ఈనెల 17 వ‌ర‌కు ప్రత్యేక కార్య‌క్ర‌మాలు
– 16న క‌ళ్యాణోత్స‌వం, ర‌థోత్స‌వం
తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మండ‌లం అంతారం అనుబంధ గ్రామం ద‌స్త‌గిరిపేట్‌లో వెల‌సిన శ్రీ శ్రీ‌దేవి భూదేవి శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి దేవాల‌యానికి వార్షిక శోభ సంత‌రించుకుంది. నేటి నుంచి ఆల‌యంలో వార్షికోత్స‌వ ఉత్స‌వాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త‌లు, అర్చ‌కులు శ్రీ వేంక‌టాచార్ శుక్ర‌వార్, శ్రీ రాఘ‌వాచార్ శుక్ర‌వార్‌, శ్రీ పురంద‌రాచార్ శుక్ర‌వార్‌లు తెలిపారు. ఈ వార్షికోత్స‌వ ఉత్స‌వాలు ఈనెల 17వ తేది వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని చెప్పారు. వార్షికోత్సాల‌లో భాగంగా నేడు ఆలయంలో శేష వాహ‌న‌ము, 10న గ‌రుడ వాహ‌న‌ము నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఉత్స‌వాల‌లో ప్ర‌ధాన ఘ‌ట్టాలైన స్వామి వార్ల క‌ళ్యాణోత్స‌వం, ర‌థోత్స‌వం 16వ తేదిన నిర్వ‌హించడం జ‌రుగుతుంద‌ని తెలిపారు. అదేరోజు సాయంత్రం అశ్వ‌వాహ‌న‌ము, ఉయ్యాల సేవ కార్యక్ర‌మాలు కొసాగుతాయ‌ని తెలిపారు. ఈ ఉత్స‌వాల‌కు భ‌క్తులు కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ హాజ‌రై స్వామి వార్ల‌ను ద‌ర్శించుకుని కృప‌కు పాత్రులు కాగ‌ల‌ర‌ని విజ్ఞ‌ప్తి చేశారు.