అభివృద్ధి, సంక్షేమ ప్రదాయుడు సీఎం కేసీఆర్..!

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

అభివృద్ధి, సంక్షేమ ప్రదాయుడు సీఎం కేసీఆర్..!
– ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– తాండూరులో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
– ఆసుపత్రుల్లో అన్నదానం, రోగులకు పండ్లు పంపిణీ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని స‌మానాంగా న‌డినిపిస్తున్న సార‌థి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను మంగళవారం టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ నయూం ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఇందులో భాగంగా తాండూరు పట్టణంలోని జిల్లా ఆసుపత్రి పండ్ల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు హాజరై రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అంతకుముందు టీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రిలో అల్పహారం వితరణ చేశారు.
జిల్లా ఆసుపత్రిలో పండ్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రత్యేక రాష్ట్ర కలను సీఎం కె సీఆర్ ఉద్యమ స్పూర్తితో సాధించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తుచేశారు. దీంతో పాటు గ్రామాలను, పట్టణాలను అభివృద్ధి బాటలో నడిపించారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి ప్రధాయుడు సీఎం కేసీఆర్ అని అభివర్ణించారు. సీఎం కేసీఆర్‌ను ప్రజలందరూ ఆశీర్వదించాలన్నారు. మరోవైపు ఈ మూడు రోజుల పాటు నాయకులు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను అంబరాన్నంటేలా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణం పురుషోత్తంరావు, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పద్దోళ్ల నర్సింలు, మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మాజీ డీపీ సీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సీనియర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, వెంకన్నగౌడ్, రవి. రాము, భీంసింగ్, కో ఆప్షన్ సభ్యులు వెంకట్రామ్ నాయక్. టీఆర్ఎస్ పట్టణ మహిళ అధ్యక్షురాలు సౌజన్య, టీఆర్ ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, రాజుగౌడ్, మసూద్, నర్సిరెడ్డి, గోపాల్, సంజీవరావు, గుండప్ప, చెన్ బనప్పు. సంతోష్ గౌడ్, ఇంతియాజ్, చంటియాదవ్, విజయ్, సమద్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.