ఐపీఎల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..
– షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ
దర్శిని డెస్క్ : ఐపీఎల్( ఇండియన్ ప్రీమియర్ లీగ్) అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్- 2022 సీజన్ కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆదివారం విడుదల చేసిన చేసిన జాబితాలో 15వ సీజన్ లో భాగంగా మార్చి 26 న మొదటి మ్యాచ్, మే 29న ఫైనల్ మ్యాచ్ జరగనుందని వెల్లడించింది. మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్ కతా నైట్ రైడర్స్ ముంబైలోని వాంఖడే మైదానంలో తలపడతాయని చెప్పింది. అయితే ఐపీఎల్-15 సీజన్ మొత్తం 65 రోజుల పాటు, మొత్తం 70 లీగ్ మ్యాచ్ లు జరుగుతాయని వివరించింది. మరో నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి. మే22న చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. ముంబయిలోని వాంఖడే, డీవై పాటిల్ స్టేడియాల్లో 20 మ్యాచ్ లు చొప్పున జరగనుండగా… పుణేలోని ఎంసీఏ స్డేడియంలో, ముంబైలోని బ్రబోర్న్ స్టేడియాల్లో 15 మ్యాచ్ ల చొప్పున జరుగుతాయి. ఈసారి మొత్తం 12 డబుల్ హెడర్స్ మ్యాచ్ లు జరగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్ 3.30లకు ప్రారంభంకానుండగా .. రాత్రి మ్యాచ్ గం. 7.30లకు స్టార్ట్ కానుంది. మే 22న హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగే పోరుతో లీగ్ పోరు ముగుస్తుంది.
గ్రూప్-ఏ(టీమ్స్)
ముంబై ఇండియన్స్
*కోల్‌కతా నైట్ రైడర్స్
*రాజస్థాన్ రాయల్స్
*ఢిల్లీ క్యాపిటల్స్
*లక్నో సూపర్ జెయింట్స్
గ్రూప్ -బీ (టీమ్స్)
*చెన్నై సూపర్ కింగ్స్
*సన్‌రైజర్స్ హైదరాబాద్
*రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
*పంజాబ్ కింగ్స్
*గుజరాత్ టైటాన్స్


