చెక్క ట్రేడ్‌మిల్ భ‌లే..!

టెక్నాలజీ తెలంగాణ హైదరాబాద్

చెక్క ట్రేడ్‌మిల్ భ‌లే..!
– సామాన్యుడి ప్ర‌తిభ‌కు కేటీఆర్ ఫిదా
– సాయం చేయండంటూ రీట్వీట్ చేసిన కేటీఆర్
ద‌ర్శిని డెస్క్ : నేటి ప‌రిస్థితుల్లో సంపన్నులు, డ‌బ్బులు ఉన్న వారు శారీర‌క ధారుఢ్యం కోసం ట్రేడ్‌మిల్ వినియోగం ఆభ‌ర‌ణంగా మారింది. కాని పేద‌ల‌కు ఆ స‌దుపాయం పొంద‌డం ఖ‌ర్చుతో క‌ష్ట‌సాధ్య‌మే. ఇప్పుడు ఆ స‌దుపాయం పొంద‌డం సాధ్య‌మ‌ని నిరూపించాడు ఓ సామాన్యుడు. అత‌ని అద్భుత ప్ర‌తిభ‌కు తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కూడ ఫీదా అయ్యారంటే అది అతిశ‌యోక్తే. ఆర్థికంగా పరిస్థితులు సహకరించకపోయినా ట్యాలెంట్‌తో అద్భుతాలు సృష్టించవచ్చు. అవసరం, ఆలోచనే పెట్టుబడిగా ఎంతో మంది అద్భుతాలు సృష్టించారు. ప్రతిభ ఉండాలే కానీ ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చని చెబుతుంటారు. మన చుట్టూ ఉన్న వారు ఎంతో మంది దీనిని నిజం చేసి చూపించారు కూడా. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఓ వీడియో ఇలాంటి ఓ అద్భుత ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది.

ఇటీవల ట్రెడ్‌మిల్స్‌ వినియోగం బాగా పెరిగిపోయింది. ఇంట్లోనే వాకింగ్‌, జాగింగ్‌ చేసే వారికి ఉపయోగపడేదే ఈ ట్రెడ్‌మిల్స్‌. విద్యుత్‌ సహాయంతో పనిచేసే ఈ మెషిన్స్‌ ధర ఎక్కువగా ఉంటాయి. దీంతో అందరూ వీటిని ఉపయోగించలేని పరిస్థితి. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే ఓ సామాన్యుడు అద్భుత సృష్టిని చేశాడు. విద్యుత్‌ అవసరం లేకుండా, చెక్కల సహాయంతో ఓ ట్రెడ్‌మిల్‌ను రూపందించాడు. అరుణ్ భ‌గ‌వంతుల అనే వ్య‌క్తి త‌న ట్విట‌ర్ కాతాలో చెక్క‌ల‌తో ప‌నిచేసే ట్రేడ్‌మిల్ వీడియోను పోస్టు చేశారు.

ప్రత్యేక స్ప్రింగుల ద్వారా దానికదే రోల్‌ అయ్యేలా ఈ ట్రెడ్‌మిల్‌ను తయారు విధానం, ఈ మెషిన్‌ తయారీకి సంబంధించి పూర్తి వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చివరికి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ వీడియోను రీట్వీట్‌ చేసిన మంత్రి.. అద్భుతం అంటూ కామెంట్ చేశాడు. అంతటితో ఆగకుండా టీ వర్క్స్‌ హైదరాబాద్‌కు ట్యాగ్‌ చేస్తూ.. ‘అతన్ని కలిసి, సాయం చేయండి’ అంటూ రాసుకొచ్చారు.
వీడియో కోసం క్లిక్ చేయండి