శ్రీరాములోరి సేవలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి

తాండూరు రాజకీయం వికారాబాద్

శ్రీరాములోరి సేవలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– నవమి వేడుకలలో ప్రత్యేక పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: శ్రీసీతారాముల సేవలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తరించారు. ఆదివారం శ్రీరామ నవవి సందర్భంగా తాండూరు పట్టణంలోని ఇందిరానగర్, సీసీఐ కాలనీ, స్టేషన్ హానుమాన్, సీతారంసెట్ హనుమాన్ దేవాలయాలతో పాటు యాలాల మండలం జుంటుపల్లిలో నిర్వహించిన వేడుకలలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన శ్రీరామనవమి ఉత్సవాలలో సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. భక్తులకు శ్రీరామచంద్రుని కరుణ కటాక్షాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ వంట ప్రజా ప్రతినిధులు, దేవాలయాల చైర్మన్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు,