మూడు నెలల్లో మిషన్ భగీరథ పూర్తి
– ట్రయల్ ముగిశాకా గుంతల పూడ్చివేత
– వార్డు సమస్యల పరిష్కారానికి కృషి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి
– మూడో రోజు ప్రారంభమైన గల్లిగల్లికి ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధిలోని వచ్చే మూడు నెలల్లో మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ అందిస్తామని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని వార్డు సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన గల్లిగల్లీకి ఎమ్మెల్యే కార్యక్రమం మూడో రోజు కొనసాగింది. బుధవారం ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పట్టణంలోని 1 వ వార్డు మల్‌రెడ్డిపల్లి నుంచి పర్యటనను ప్రారంభించారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్, వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ తదితరులతో కలిసి వార్డు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో తాగునీటికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మూడు నెలల్లోమిషన్ భగీరథ పనులు పూర్తి చేసి ఇంటింటికి నల్లా కనేక్షన్ అందిస్తామన్నారు. అదేవిదంగా మిషన్ ట్రయల్ ముగిసిన తరువాత మిషన్ భగీరథ కోసం తవ్విన గుంతలు పూర్తిగా మరమత్తులు చేస్తామన్నారు. దీంతో పాటు వార్డుల్లో మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేయడం జరుగుతుందన్నారు. మురుగు కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చి నిధులు మంజూరు చేస్తామన్నారు. వార్డుల్లో విద్యుత్ సమస్యల పట్ల ఆ శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడాలని, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, కౌన్సిలర్లు భీమ్ సింగ్, మంకాల్ రఘు, ముక్తార్ నాజ్, బాలప్ప, మధుబాల, పలు శాఖల అధికారులతో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ సంపత్, నర్సింలు, రాజు గౌడ్, నయూం (అఫూ), శ్రీనివాస్ చారి, నర్సిరెడ్డి,హరిహర గౌడ్, పరిమళ, సంతోష్ గౌడ్, రాజన్ గౌడ్, అడ్వకేట్ గోపాల్, బాలకృష్ణ రెడ్డి, ఆర్. సంతోష్, ఇంతియాజ్, జావిధ్ తదితులున్నారు.
