రేపు మున్సిప‌ల్ కౌన్సిల్ అత్య‌వ‌స‌ర స‌మావేశం

తాండూరు రాజకీయం

రేపు మున్సిప‌ల్ కౌన్సిల్ అత్య‌వ‌స‌ర స‌మావేశం
– ప్ర‌కటించిన చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : రేపు తాండూరు మున్సిప‌ల్ కౌన్సిల్ అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేసిన‌ట్లు చైర్ ఫ‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ గుప్త తెలిపారు. ఈ విష‌యాన్ని బుధ‌వారం ఆమె ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. గురువారం మున్సిప‌ల్ నూత‌న భ‌వ‌నంలో ఉద‌యం 11 గంట‌ల‌కు ఈ స‌మావేశం ప్రారంభ‌వుతుంద‌ని చెప్పారు. ఈ స‌మావేశానికి కౌన్సిల‌ర్లు, అధికారులు, కోఆప్ష‌న్ స‌భ్యులు స‌కాల‌నికి హాజ‌రుకావాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. మ‌రోవైపు రేపు నిర్వ‌హిస్తున్న మున్సిప‌ల్ కౌన్సిల్ స‌మావేశంపై ఉత్కంఠ నెల‌కొంది. గ‌త స‌మావేశాల‌లో చోటుచేసుకున్న వివాదాలు, రాద్దాంతాలు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామాల మ‌ద్య కౌన్సిల్ స‌మావేశం స‌వ్యంగా జ‌రుగుతుందా లేదా అని ఆస‌క్తి నెల‌కొంది.