ఆర్టీపీసీఆర్తో మంకీఫాక్స్ పరీక్ష
– గంటలోగా ఫలితాలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: కరోనా మహమ్మారి తరువాత ఈ మధ్య మంకీఫాక్స్ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆరోగ్య సంస్థ నివేధికలో ఈ మహమ్మారి వల్ల ప్రపంచలోని 20కి పైగా దేశాల్లో దాదాపు 200 మంకిపాక్స్ వైరస్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. భారతదేశంలో ఇంకా ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. ఈ క్రమంలోనే మంకీఫాక్స్ వైరస్‌ను గుర్తించడానికి ఓ కొత్త RT-PCR కిట్ వెలుగులోకి వచ్చింది. వార్తా సంస్థ ANI నివేదించిన ప్రకారం.. “ట్రివిట్రాన్ (Trivitron) హెల్త్‌కేర్ పరిశోధన, అభివృద్ధి బృందం మంకీపాక్స్ వైరస్‌ను గుర్తించడానికి RT- PCR ఆధారిత కిట్‌ను రూపొందించింది. నాలుగు రంగులలో ఈ కిట్‌ను అభివృద్ధి చేశారు. ఈ కిట్ ద్వారా స్వాట్ టెస్ట్ ఒకే ట్యూబ్‌లో పరీక్ష చేయవచ్చు. దీంతో పాటు ఈ కిట్‌తో మసూచి, మంకిపాక్స్ మధ్య తేడాను గుర్తించగలదు. మొత్తం ప్రక్రియకి ఒక 1 గంట సమయం పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా మంకిపాక్స్ వ్యాధి కేసులు వెలుగుచూస్తుండటంతో భారతదేశం అలర్ట్ గా ఉంది. ఇప్పటివరకు దేశంలో ఎటువంటి కేసు నమోదు కాకపోవడం శుభపరిణామం.
గమనిక :- ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.


