మంచినీటి కోసం ముట్టడి
– మున్సిపల్ ముందు మహిళల బైటాయింపు
– మద్దతు తెలిపిన యు.రమేష్ కుమార్
– చైర్ పర్సన్ హామితో ఆందోళన విరమణ
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఏళ్లుగా మంచి నీటి సమస్యను పరిష్కరించడం లేదని తాండూరు మహిళలు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. తాగునీటి సమస్య పరిష్కారం తేల్చాలని ఖాళిబిందెలతో నిరసనకు దిగారు. గురువారం తాండూరు మున్సిపల్ పరిధి 24 వ వార్డు కౌన్సిరల్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో మున్సిపల్ నూతన కార్యాలయం వద్ద మహిళలతో కలిసి ఆందోళన చేపట్టారు.
24వ వార్డులో గత కొన్ని సంవత్సరాల తాగునీటి సమస్యల తాండవిస్తోంది. అధికారులకు చెప్పిన పరిష్కారం కావడం లేదని ఆరోపిస్తూ ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ ద్వారం వద్ద బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ కార్యాలయానికి చేరుకుని మహిళ ఆందోళనకు మద్దతు తెలిపారు. తాగునీటి సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూనే అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సమస్య పరిష్కరించేంత వరకు కదిలేది లే దీని భీష్మించుకు కూర్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కార్యాలయానికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడారు. రాబోవు 20 రోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుంటామని, అప్పటి వరకు తాత్కాళికంగా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసేందుకు కృషి చేస్తామని హామి ఇచ్చారు. దీంతో మహిళలు శాంతించి ఆందోళన విరమించారు.


