త‌ల్లిదండ్రులు లేని అనాథ బాలిక‌ల‌కు శుభ‌వార్త‌

కెరీర్ తాండూరు వికారాబాద్ హైదరాబాద్

త‌ల్లిదండ్రులు లేని అనాథ బాలిక‌ల‌కు శుభ‌వార్త‌
– పాలిటెక్నిక్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
– జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: హైద‌రాబాద్‌లోని దుర్గాబాయి దేశముఖ్ ప్రభుత్వ మహిళ టెక్నికల్ శిక్షణా సంస్థలో పాలిటెక్నిక్ డిప్లమో కోర్సులకు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు జిల్లా మ‌హిళ శిశు సంక్షేమ శాఖ అధికారి ల‌లిత తెలిపారు. 2022-2023 విద్యాసంవత్సరంలో 3 సంవ‌త్స‌రా డిప్ల‌మో కోర్సుల‌కు గానూ తల్లిదండ్రులు కోల్పోయిన (అనాధ) బాలికల నుండి మాత్రమే దరఖాస్తులు స్వీక‌రించ‌డం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఇంజనీరింగ్ తదితర కోర్సులకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ప్రతి కోర్సులో 60 సీట్లకు గానూ , మొత్తం 240 సీట్లలో 70 శాతం తల్లిదండ్రులు కోల్పోయిన (అనాధ) బాలికలు, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన నిరుపేద బాలికలకు లేదా అక్రమ రవాణా బాధితులకు కేటాయించడం జరుగుతుందని, వీరు పాలిటెక్నిక్ అర్హత ప్రవేశ పరీక్ష రాయకున్నా కనీసం పదవ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలని , 3 శాతం సీట్లు దివ్యాంగులకు కేటాయించడం జరిగిందన్నారు. అభ్యర్థులు కులం(అనాద బాలికలకు అవసరం లేదు), ఆధాయ దృవీకరణ (అనాద బాలికలకు అవసరం లేదు) మరణ దృవీకరణ పత్రములు, బోనాఫైడ్ ధ్రువపత్రాలను కార్యాలయంలో లభించే దరఖాస్తు ఫారంనకు జతచేయాల‌న్నారు. పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను సాయిబాబా కాలనీ, ఏన్నే పల్లి వికారాబాద్ నందు గల బాల రక్షా భవన్ కార్యాలయంలో జూన్ 20 తేది వరకు తమ దరఖాస్తులు సమర్పించాల‌ని సూచించారు. పూర్తి వివరాలకు 6300725515 /9160314854 లను సంప్రదించాలని, ఎంపికైన బాలికలకు ఉచిత విద్య, వసతి కల్పించడం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు.