గురుపౌర్ణ‌మి సంద‌డి @ తాండూరు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

గురుపౌర్ణ‌మి సంద‌డి @ తాండూరు..!
– శోభాయ‌మానం సాయిబాబా రథయాత్ర
– పూజ‌లు నిర్వ‌హించిన శంక‌ర్ యాద‌వ్ దంపతులు
– ప్రారంభించిన ప‌ట్ట‌ణ ప్ర‌ముఖులు

తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరులో గురుపౌర్ణ‌మి వేడుక‌లు సంద‌డిగా ప్రారంభమ‌య్యాయి. గురుపౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరు – కోకట్ రోడ్డు మార్గంలో వెలసిస షిర్డిసాయిబాబా భజన మండలి ఆద్వర్యంలో సాయిబాబా ర‌థ‌యాత్ర ఊరేగింపు చేప‌ట్టారు. మంగ‌ళ‌వారం తాండూరు పట్టణంలోని కోడంగల్‌, అంబేద్కర్ చౌరస్తా సమీపంలో ఉన్న భవాని మాత దేవాలయం నుంచి ఈ శోభాయాత్ర ముందుకు కదిలింది. తాండూరు మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు, టీఆర్ఎస్ తాండూరు అధికార ప్ర‌తినిధి రాజుగౌడ్, సాయిపుత్ర హోమ్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాద‌వ్, చంద్ర‌క‌ళ దంప‌తులు, సాయిలుగౌడ్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం సాయి భక్తులు సాయిబాబా చిత్రపటానికి శంక‌ర్ యాద‌వ్, చంద్ర‌క‌ళ దంప‌తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం ముందు నుంచి ప్రారంభ‌మైన‌ సాయిబాబా రథయాత్ర శోభాయ‌మానంగా ముందుకు సాగింది. పట్టణంలోని పుర వీదులగుండా ఈ ఊరేగింపు కో నసాగింది. ఊ రేగింపు ముందు భక్తులు సాయిబాబా మహిమలను చాటుతూ భజన కీర్తనలు ఆలాపించారు. ఈ ఊ రేగింపుకు ప్రజలు, భక్తులు స్వాగతం పలుకుతూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.