గుర్తుతెలియ‌ని యాచ‌కురాలు మృతి

క్రైం తాండూరు వికారాబాద్

గుర్తుతెలియ‌ని యాచ‌కురాలు మృతి
– ఆచూకీ తెలిస్తే చెప్పాల‌ని పోలీసుల విజ్ఞ‌ప్తి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: అనారోగ్యంతో గుర్తుతెలియ‌ని యాచ‌కురాలు మృతి చెందింది. ఈ సంఘ‌ట‌న తాండూరు ప‌ట్ట‌ణ పోలీస్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ప‌ట్ట‌ణ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి. తాండూరు ప‌ట్ట‌ణం ప్ర‌భుత్వ జిల్లా ఆసుప‌త్రిలోని జ‌న‌ర‌ల్ స్టోర్ వ‌ద్ద సోమ‌వారం రాత్రి దాదాపు 60 ఏండ్లు ఉన్న గుర్తుతెలియ‌ని యాచ‌కురాలు అప‌స్మార‌క స్థితిలో ప‌డిఉంది. గ‌మ‌నించిన ఆసుప‌త్రి వైద్య సిబ్బంది చికిత్సకు త‌ర‌లించారు. ప‌రీక్షించిన వైద్యులు అప్ప‌టికే ఆమె మ‌ర‌ణించిన‌ట్లు నిర్దారించారు. అయితే మృతురాలి వ‌ల్ల ఎలాంటి వివ‌రాలు, ఆధారాలు లేక‌పోవ‌డంతో ప‌ట్ట‌ణ పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వైద్య సిబ్బంది ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు జ‌రుపుతున్న‌ట్లు ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. మృతురాలి ఆచూకీ తెలిస్తే ప‌ట్ట‌ణ పోలీసులు సెల్: 9440627355, 9440627224ల‌కు సంప్ర‌దించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. మృత‌దేహాన్ని ఆసుప‌త్రిలోని మార్చురిలో ఉంచిన‌ట్లు తెలిపారు.