రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఓటు వేసిన సీఎం కేసీఆర్

జాతీయం తెలంగాణ హైదరాబాద్

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఓటు వేసిన సీఎం కేసీఆర్
– కేసీఆర్‌తో పాటు ప‌లువురు నేత‌లు కూడ
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: భార‌త‌ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక పోలింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. రాష్ట్ర అసెంబ్లీ క‌మిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన పొలింగ్‌లో ప‌లువురు ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. కేసీఆర్‌తో పాటు శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ప్ర‌శాంత్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కూడా ఓటు వేశారు. విప‌క్షాల అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ పార్టీ మ‌ద్ద‌తు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇప్ప‌టి వ‌ర‌కు 116 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. ఇంకా మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్, ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేశ్‌, కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోలేదు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఈ నెల 21న ఎన్నిక ఫలితాలను ప్రకటిస్తారు.

రాష్ట్ర అసెంబ్లీ క‌మిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో రాష్ట్రపతి ఎన్నికల ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్య‌మంత్రి శ్రీ కేసీఆర్. pic.twitter.com/Qpqupok3LD

— TRS Party (@trspartyonline) July 18, 2022