తాండూరులో ఇద్దరికి కరోనా
– మళ్లీ కలవర పెడుతున్న కేసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: మళ్లీ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న కరోనా తాండూరులో కూడ కలవరపెడుతోంది. ఈ మహామ్మారి కేసులు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈనెల మొదట్లో 15 కేసులు నమోదయ్యాయి. నిత్యం పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికి కొన్ని రోజులు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. తాజాగా బుధవారం నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ అని తేలిందని జిల్లా ఆసుపత్రి పీపీ యూనిట్ ఇంచార్జ్ వైద్యులు డా.బాస్కర్ తెలిపారు.మొత్తం 27 మందికి రాట్, 10 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా అందులో 35 మందికి నెగిటివ్ అని, ఇద్దరికి మాత్రమే పాజిటివ్ అని వచ్చిందని వెల్లడించారు. మరోవైపు ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లు హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళనకు చెందుతున్నారు. అయితే రెండు డోసులు కరోనా వ్యాక్సీనేషన్ తీసుకున్న వారు గడువు తీరితే బూస్టర్ డోస్ తప్పక తీసుకోవాలని, మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.



