వ్యవసాయ రంగం బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం

తాండూరు రాజకీయం వికారాబాద్

వ్యవసాయ రంగం బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం
– రైతులు అభ్యున్నతికి వినూత్న కార్య్రమాలు
– అధిక దిగుబడులు అందించే సాగులో రైతులు ముందుండాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

మంగళవారం తాండూరు మండలం అంతారం రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు నేస్తం 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావుతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడారు.

తాండూరు నియోజకవర్గంలోని వ్యవసాయ పరిస్థితులను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతుల అభివృద్ది పరిచేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. త్వరలోనే ఇతర రంగాల వారు సైతం వ్యవసాయంలోకి అడుగుపెట్టే ఆస్కారం ఉందన్నారు. చిరుధాన్యాలలో సాగు చేస్తే రెట్టింపు ఆదాయం పొందవచ్చు అన్నారు.

ఎల్‌నినో ప్రభావం వల్ల తక్కువ నీరు అవసరమయ్యే కంది, మొక్కజొన్న వంటి ఆరుతడి పంటలు పండించాలన్నారు. రైతులు ఆదాయం వచ్చే పంటలను సాగు చేసి లబ్ధి పొందాలని సూచించారు ఆయిల్ ఫామ్ ద్వారా రైతులకు విరివిగా ఆదాయం లభిస్తుందన్నారు. అదేవిధంగా రైతు నేస్తం కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పలువురు ఆదర్శ రైతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి లక్ష్మి, డీఏఓ కవిత, ఏడీఏ అరుణ, ఏవో కొమురయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, కాంగ్రెస్ అధ్యక్షులు రాజకుమార్, వి.శ్రీనివాస్, నాగప్ప, రైతులు పాల్గొన్నారు.

శోభాయమానంగా సాయి బాబా పల్లకి సేవ..!