వీఆర్ఎలపై వివక్ష చూపించొద్దు
– న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి
– కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం వీఆర్ఎలపై వివక్ష చూపించడం తగదని కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం తాండూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద గత రోజులుగా వీఆర్ఎలు సమ్మెను కొనసాగిస్తున్నారు. శుక్రవారం ప్రభాకర్ గౌడ్‌తో పాటు పలువురు నేతలు సమ్మె వద్దకు చేరుకుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని వీఆర్ఎలు ప్రజల్లోకి తీసుకెళతారన్నారు. వారికి పే-స్కేల్ అందిస్తామని చెప్పిన ప్రభుత్వం అమలు చేయకపోవడం దారుణమన్నారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు వారికి రూ. 21 వేల కనీస వేతనం అమలు చేయడంతో పాటు వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. లేదంటే వీఆర్ఎలకు మద్దతుగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జావిద్ ఖాన్, జిల్లా మైనార్టీ నాయకులు నవాజ్, ఎన్ఎస్‌యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాగ్, ఎస్సీ సెల్ నాయకులు నవీన్, నాయకులు అంజిలయ్య, సురేష్, నారా అశోక్, సమద్, ఖయ్యూం, సమీర్, సిద్దిక్, ఎన్ఎస్‌యూఐ నియోజకవర్గ అధ్యక్షులు సందీప్ రెడ్డి, వీఆర్వోలు ఉన్నారు.



