అందరికి రక్షణగా నిలవాలి
– పోలీసులకు రాఖీలు కట్టిన మహిళ నేతలు
– బీజేపీ మహిళ మోర్చ ఆధ్వర్యంలో రాఖీ సంబరాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజంలో అందరికి రక్షణగా నిలిచేది పోలీసులే అని బీజేపీ వికారాబాద్ జిల్లా మహిళ మోర్చ అధ్యక్షురాలు సాహు శ్రీలత అన్నారు. బుధవారం మహిళ మోర్చ ఆధ్వర్యంలో రాఖీ సంబరాలను నిర్వహించారు. ఇందులో భాగంగా తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, ఎస్ఐలు వేణు గోపాల్ గౌడ్, మహిపాల్ రెడ్డి, సిబ్బందికి మహిళ మోర్చ జిల్లా అధ్యక్షురాలు సాహు శ్రీలతతో పాటు ఫ్లోర్ లీడర్ అంతారం లలిత తదితరులు రాఖీలు కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహిళ సంరక్షణ కోసం పోలీసు శాఖ అహర్నిషలు కృషి చేస్తుందని అన్నారు. రాఖీ అంటనే రక్ష కాబట్టి సోదరభావంతో మహిళలకు రక్షణగా నిలవాలనే ఉద్దేశంతో పోలీసులకు రాఖీలు కట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బంటారం లావణ్య, బీజేపీ మహిళ మోర్చ జిల్లా ఉపాధ్యక్షురాలు సుజాత, జిల్లా కార్యదర్శి రేణుక, సుదర్శిణి, హరతి తదితరులు పాల్గొన్నారు.



