రెచ్చిపోతున్న బైకు దొంగ‌లు

క్రైం తాండూరు వికారాబాద్

రెచ్చిపోతున్న బైకు దొంగ‌లు
– పార్కు చేసిన చోటు నుంచి చోరి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరులో బైకు దొంగ‌లు రెచ్చిపోతున్నారు. గ‌త కొన్ని రోజులు నుంచి పార్కు చేసిన ఉంచిన బైకుల‌ను ఎత్తుకెళ్లిపోతున్నారు. దీంతో బాధితుల నుంచి పోలీస్టేష‌న్‌లో ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. గ‌త వారం రోజుల క్రితం కేవిపీఎస్ వికారాబాద్ జిల్లా అధ్య‌క్షులు, యాలాల మండ‌లంకు చెందిన ఉప్ప‌లి మ‌ల్క‌య్య త‌న హిరో హొండా స్ల్పెండ‌ర్ బైకు ఎపీ07ఏసీ 1302 ను తాండూరు ప‌ట్ట‌ణంలోని జిల్లా ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో పార్కు చేశారు. త‌రువాత వ‌చ్చి చూసే స‌రికి బైక్ క‌న‌పించ‌లేదు. తాజాగా ఓ ప‌త్రిక‌లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్న వెంక‌ట్రామ్ రెడ్డి ప‌ట్ట‌ణంలోని ఎమ్మెల్సీ నివాసం స‌మీపంలో ఉన్న అర‌వింద్ కాంప్లెక్స్‌లో బైక్‌ను పార్కు చేశారు. సోమ‌వారం రాత్రి పార్కు చేసిన బైకు మంగ‌ళ‌వారం వ‌చ్చి చూసేస‌రికి క‌నిపించ‌కుండా పోయింది. గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు బైకుకు అప‌హ‌రించుకుపోయిన‌ట్లు గుర్తించి పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ప‌ట్ట‌ణ సీఐ రాజేంద‌ర్ రెడ్డిని క‌లిసి ఫిర్యాదు చేశారు. ఇలా ప‌ట్ట‌ణంలో ప‌లు సంఘ‌ట‌న‌ల్లో బైకులు మాయ‌మ‌వుతున్నాయి. గుర్తుతెలియ‌ని బైకు దొంగ‌లు రెచ్చిపోయి చోరీల‌కు పాల్ప‌డుతున్నారు. ఈ విష‌యంలో పోలీసులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో వేచి చూడాలి.