వార్డు అభివృద్ధే ధ్యేయం..!
– ఆటంకాలు ఎదరైనా ప్రగతి మాత్రం ఆపను
– 7వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఈర్షాద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎవ్వరు అడ్డుకున్న తన వార్డును అభివృద్ధిని చేయడమే తన ధ్యేయమని తాండూరు మున్సిపల్ 7వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఈర్షాద్ అన్నారు.

శనివారం తన వారడ్ఉలోని 7వ వార్డులో సీసీ రోడ్డు పనులను కౌన్సిలర్ ఈర్షాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామి మేరకు ఎన్టీఆర్ కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

ఎన్టీఆర్ కాలనీలోనే కాదు 7వ వార్డు మొత్తం అభివృద్ధి చేయించే బాధ్యత నాది అని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే దిశగా ఒక్కో పని పూర్తి చేయడమే లక్ష్యమని అన్నారు. ప్రజల ప్రేమ, ఆశీర్వాదం ఉన్నంతకాలం పెండింగ్‌లో ఉన్న ప్రతి పనిని పూర్తి చేయించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఎవరు ఎంత అడ్డుకున్నా, అభివృద్ధి పనులు మాత్రం ఆగవని అన్నారు. దమ్ముంటే ఆపే ప్రయత్నం చేయాలని ప్రత్యర్ఞులకు సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు ఉన్నారు.


