సేఫ్ అయిన డ్రైవ‌ర్‌ది తాండూరే..!

క్రైం తాండూరు రంగారెడ్డి వికారాబాద్

సేఫ్ అయిన డ్రైవ‌ర్‌ది తాండూరే..!
– మ‌ర్ప‌ల్లి పోలీస్టేషన్‌లో రాఘ‌వేంద‌ర్‌రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : వికారాబాద్ జిల్లా తిమ్మాపూర్ కారు గ‌ల్లంతు ఘ‌ట‌న‌లో క్షేమంగా బ‌య‌ట‌ప‌డిన డ్రైవ‌ర్ తాండూరుకు చెందిన‌ట్లుగా తెలిసింది. తాండూరు మండ‌లం అంతారం గ్రామానిక శేరీ శ్రీ‌నివాస్ రెడ్డి కుమారుడు రాఘవేంద‌ర్‌రెడ్డి(చిన్నా)గా పోలీసులు గుర్తించారు. అయితే రాఘ‌వేంద‌ర్ రెడ్డి హ‌రిటేజ్ పాల వ్యాన్ డ్రైవర్‌గా బీరంగూడ‌లో ప‌నిచేసిన‌ట్లు స‌మాచారం. రాఘ‌వేంద‌ర్‌రెడ్డి అమ్మ‌మ్మ ఊరు రావుల‌ప‌ల్లి కావ‌డంతో వారం రోజులుగా అక్క‌డే ఉన్నాడు. వ‌రుస‌కు న‌వాజ్‌రెడ్డికి బంధువులు కావ‌డంతో వారితో క‌లిసి కారులో వెళ్లాడు. తిరిగి తిమ్మాపూర్ నుంచి తిరిగి వెళుతుండ‌గా వాగులో కారు గ‌ల్లంతు అయ్యింది. అదివారం రాత్రి ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డిన రాఘ‌వేంద‌ర్ రెడ్డి భ‌య‌ప‌డి త‌ల‌దాచుకున్నాడు. మామ‌కు స‌మాచారం అందించ‌డంతో అత‌ను రాఘేంద‌ర్ రెడ్డిని మ‌ర్ప‌ల్లి పోలీస్టేష‌న్‌లో అప్ప‌గించారు. ప్ర‌స్తుతం రాఘ‌వేంద‌ర్ రెడ్డి పోలీస్టేష‌న్ లో ఉన్న‌ట్లు తెలిసింది.