ద్రోహులకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వొద్దు..!
– రేవంత్ ఆశీర్వాదం దారులే పోటీలో ఉండాలి
– ఆయనకు సహకరించేవారికే పూర్తి మద్దతు
– కాంగ్రెస్ నాయకులు శ్రీరాంరెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి తాండూరు నియోజకవర్గ టిక్కెట్టును ద్రోహులకు ఇవ్వొద్దని ఆ పార్టీ నాయకులు శ్రీరాంరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం తాండూరు పట్టణంలోని ఓ హోటల్‌లో జరిగిన మీడీయా సమావేశంలో శ్రీరాంరెడ్డి కాంగ్రెస్ టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాతతో కలిసి మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పార్టీకి, ఓట్లు వేసి గెలిపించిన వారికి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఆ ఎన్నికలకు ముందు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీగౌడ్ ద్వారా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి తానే రోహిత్ రెడ్డిని పరిచయం చేశానని గుర్తుచేశారు. మూడు నెలల్లో పార్టీ టిక్కెట్టు దక్కించుకుని ఆరు నెలల్లో పార్టీకి దోహ్రం చేశారని, 70వేల మంది ఓటర్లకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఈ సారి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఆశీర్వాదం ఉన్న వారికి తాండూరు టిక్కెట్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాళ్లే పోటీలో ఉండాలని ఆకాంక్షించారు. రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చే ఎమ్మెల్యే అభ్యర్థులకు నా పూర్తి సహాకారం అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో యాలాల మండల పార్టీ మాజీ అధ్యక్షులు భీమయ్య, నాయకులు కల్వ రవి, కల్వ ఉదయ్ కుమార్ తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి…

