ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి రాఖీ కట్టిన శంకుతల
– వజ్రోత్సవాలలో సీఎం కేసీఆర్ ఫ్లేక్సీకి కూడ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి టీఆర్ఎస్ నియోజకవర్గ మహిళ కన్వినర్ శకుంతల దేశ్‌ముఖ్‌పాండే రాఖీ కట్టారు. శుక్రవారం తాండూరులో పట్టణంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని వారి నివాసం వద్ద శకుంతల మర్యాదపూర్వకంగా కలిశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా రోహిత్ రెడ్డికి శకుంతల రాఖీ కట్టీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా శకుంతల ఆధ్వర్యంలో మహిళ సమాఖ్య అధ్యక్షురాలు రేణుక, ప్రతినిధులు కవిత, సంధ్య, అనసూయలు కూడ ఎమ్మెల్యేకు రాఖీలు కట్టారు. మరోవైపు తాండూరు మండలం జినుగుర్తి సమీపంలో కస్తూరీబా బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన వేడుకలలో మహిళ కన్వినర్ శకుంతల దేశ్‌పాండే ఐనెల్లి సర్పంచ్ స్వప్నజ్యోతి, పార్టీ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా శకుంతల దేశ్‌పాండే మాట్లాడుతూ రక్షాబంధన్ అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని, అందరు రక్షాబంధన్ ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు.



