మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిసిన రాజుగౌడ్

తాండూరు రాజకీయం వికారాబాద్

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిసిన రాజుగౌడ్
– కోడంగల్‌ పట్టణంలో ఘన స్వాగతం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ ను వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ కలిశారు. గురువారం కోడంగల్ మీదుగా కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలో జరిగే కార్యక్రమానికి హాజరవుతున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను రాజుగౌడ్ కోడంగల్ పట్టణంలో కలుసుకున్నారు. తాండూరు నేతలతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు రాజుగౌడ్ కూడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాజుగౌడ్ పలు రాజకీయ వ్యవహారాలపై చర్చించారు. త్వరలో తాండూరు పర్యటనకు రావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు రాజుగౌడ్ విజ్ఞప్తి చేశారు. రాజుగౌడ్ వెంట బీఆర్ఎస్ తాండూరు పట్టణ ఉపాధ్యక్షులు హరిహరగౌడ్, మధుమోహన్ గౌడ్ తదితరులు ఉన్నారు.