శభాష్ హజ్మత్..!
– సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం
– అభినందించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్
– త్వరలో సముచిత స్థానం కల్పిస్తామని హామి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తనకు ఉన్నదాంట్లో పేదలకు తోచిన సాయం అందిస్తున్న తాండూరు మండలం జినుగుర్తికి చెందిన కాంగ్రెస్ యువనాయకులు హజ్మత్‌ను శభాష్ అంటూ టీపీసీసీ ఉపాధ్యక్షులు అభినందించారు. శుక్రవారం తాండూరు పట్టణంలో జరిగిన స్వర్గీయ మాజీ మంత్రి మాణిక్ రావు వర్దంతిలో ఎం.రమేష్ మహరాజ్‌ను హజ్మత్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలువురు హజ్మత్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధితో పాటు కార్యకర్తలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాడని, అంతేకాకుండా అభాగ్యులకు, విద్యార్థులకు తోచిన సాయం అందిస్తూ అందరికి అండగా నిలుస్తున్నాడని రమేష్ మహరాజ్ దృష్టికి తెచ్చారు. దీంతో రమేష్ మహరాజ్ హజ్మత్‌ను శభాష్ అంటూ అభినందించారు. ఎన్నికల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని సూచించారు. భవిష్యత్తులో హజ్మత్‌కు సముచిత స్థానం కల్పిస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనీయర్ నాయకులు, యువకులు తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి..

