కొత్తగా 33 బీసీ గురుకులాలు
– 15 డీగ్రీ కళాశాలల ఏర్పాటుకు అనుమతి
– జీఓ విడుదల చేసిన బీసీ సంక్షేమ శాఖ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: సర్కారు విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మరో తీపికబురు చెప్పింది. బీసీ వర్గానికి చెందిన విద్యార్థులకు విద్యను మరింత చేరువ చేసేందుకు రాష్ట్రంలో కొత్తగా 33 బీసీ గురుకులాలతో పాటు 15 బీసీ డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ విషయాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం 261 గురుకులాలను మంజూరు చేయగా వాటికి అదనంగా జిల్లాకు ఒక్కోటి చొప్పున 33 గురుకులాలను మంజూరు చేసింది. అదేవిధంగా దేశ చరిత్రలోనే తొలిసారిగా ఏక కాలంలో 15 బీసీ డిగ్రీ కాలేజీలను మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ జీవో విడుదల చేసింది.


