తాండూరులో స్వచ్ఛంద బంద్
– నిర్మానుష్యమైన ప్రధాన వీధులు
– రాజాసింగ్‌కు మద్దతుగా దుకాణాల మూత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో పలువురు వ్యాపారులు స్వచ్చంద బంద్ పాటించారు. రాజాసింగ్‌కు మద్దతుగా శనివారం ఉదయం నుంచి దుకాణాలు మూతపడ్డాయి. దీంతో పట్టణంలోని ప్రధాన ప్రాంతాలు అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌరస్తా, కూరగాయల మార్కెట్, భద్రేశ్వర చౌరస్తా, శాంత్ మహాల్ చౌరస్తా తదితర ప్రాంతాలు నిర్మూనుష్యం అయ్యాయి. కిరాణా, ఎలక్ట్రికల్, వస్త్ర దుకాణాలు, హోటళ్లు, బేకరీల దుకాణాలు తెరుచుకోలేదు. హిందూ ధర్మరక్షణ కోసం పోరాడుతున్న రాజాసింగ్‌కు మద్దతు ఇచ్చందుకే వ్యాపారాలు స్వచ్ఛందంగా మూసుకున్నట్లు వ్యాపార సంఘాలు ప్రకటించాయి. ఉదయం నుంచి రాత్రి వరకు స్వచ్ఛంద బంద్ ప్రశాంతంగా కొనసాగింది.


