ప్రపంచంలోనే శివయ్యకు భారీ విగ్రహం
– నేటి నుంచే భక్తులకు దర్శన భాగ్యం
– 250 ఏళ్లు నిలబడేలా ప్రత్యేక నిర్మాణం
దర్శిని డెస్క్: పరవ శివునికి భారీ విగ్రహం కట్టించారు. ప్రపంచంలోనే అత్యంత భారీ ఎత్తైన శివయ్య విగ్రహ దర్శన భాగ్యం నేటి నుంచి భక్తులకు కల్పించే ఏర్పాట్లు పూర్తయ్యాయి. 250 ఏళ్లు ప్రస్థానం నిలబడేలా నిర్మించిన ఈ విగ్రహం రాజస్థాన్‌లో ఏర్పాటు చేశారు. రాజస్థాన్ లో ఏర్పాటు చేసిన ప్రపంచంలో అత్యంత ఎత్తైన భోళాశంకరుడు ప్రజలకు దర్శనం ఇవ్వనున్నారు. రాజ్‌సమంద్ జిల్లాలోని నద్వారా పట్టణంలోని కొండపై ధ్యాన ముద్ర రూపంలో ఉన్న శివుని విగ్రహం ప్రతిష్టించారు. ఈ శిల్పం 20 కి.మీ. దూరం నుంచి కూడా కనిపించేలా ఏర్పాటు చేశారు. అత్యంత ఎత్తైన శివుడి విగ్రహంలో ఎలివేటర్లు, మెట్లు, భక్తుల కోసం హాలు ఉన్నాయి. విగ్రహ నిర్మాణానికి 3,000 టన్నుల ఇనుము, ఉక్కు , 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీటును ఉపయోగించారు. సుమారు 10 ఏళ్లుగా శ్రమించి శివయ్య భారీ విగ్రహ నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఈ విగ్రహం 250 ఏళ్లు ఉండేలా నిర్మించారు. అలాగే గంటకు 250 కి.మీ వేగంతో వీచే గాలులు వీచినా తట్టుకునే విధంగా ఈ విగ్రహాన్ని బలంగా నిర్మించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. విగ్రహం పరిసర ప్రాంతాలు కూడా పర్యాటకులను ఆకట్టుకునేలా ఉన్నాయని తెలిపారు. విగ్రహ ప్రాంగణంలో బంగీ జంపింగ్, గో-కార్ట్ తదితర వినోద, సాహస క్రీడల సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. రాజ్‌సమంద్ జిల్లాలో ఏర్పాటు చేసిన 369 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహాన్నికార్తీక మాసంలో భక్తులకు శనివారం నుంచి దర్శనం ఇవ్వనుంది. శనివారం భక్తుల దర్శనానికి తెరవనున్నారు. దత్ పదం సంస్థాన్ స్థాపించిన ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహంగా చెప్పబడుతుంది. ఈ విగ్రహాన్ని భక్తుల సందర్శనార్థం ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి , ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరారి తదితరుల సమక్షంలో ఆవిష్కరించనున్నారు.

