కావ్యశ్రీ ఆదర్శంగా తీసుకోవాలి
– సన్మానించిన వేధిక్ విశిష్ట స్కూల్ యజమాన్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఢీ-13 విన్నర్ కావ్యశ్రీని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని తాండూరు వేధిక విశిష్ఠ ది స్కూల్ కరస్పాండెంట్ సుహాస్, ప్రిన్సిపల్ నాగభూషణంలు పేర్కొన్నారు. కావ్యశ్రీ విద్యాభ్యాషం వేధిక విశిష్ఠలో కొనసాగింది. పాఠశాలకు చెందిన కావ్యశ్రీ ఈటీవి ఢీ-13 డ్యాన్స్ షోలో అంచెలంచెలుగా ప్రతిభను కనబరిచి విన్నర్ గా నిలవడం పట్ల యజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. మంగళవారం కావ్యశ్రీని పాఠశాలకు ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. కరస్పాండెంట్ సుహాస్, ప్రిన్సిపల్ నాగభూషణం కావ్యశ్రీను శాలువాతో సత్కరించి సన్మానం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో చదివిన కావ్యశ్రీ చిన్నతనం నుంచే కష్టపడే తత్వాన్ని అలవర్చుకుందని అన్నారు. చదివిన పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకువచ్చిన కావ్యశ్రీని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కేవలం డ్యాన్స్ లోనే కాదు ఇష్టమైన రంగంలో నైపుణ్యతను పెంపొందించుకుని లక్ష్యాలను సాధించుకోవాలన్నారు. తల్లిదండ్రులతో పాటు చదివిన పాఠశాలకు మంచి పేరు తీసుకరావాలన్నారు.
అదేవిధంగా విన్నర్ కావ్యశ్రీ మాట్లాడుతూ తన తల్లిదండ్రులు, అక్కతో పాటు పాఠశాల యజమాన్యం ఎంతో ప్రోత్సహించారని అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన విధంగా నడుచుకుని అనుకున్నది సాధించాలన్నారు. అనంతరం కావ్యశ్రీ డ్యాన్స్ చేసి విద్యార్థులను ఉత్సహ పరిచారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు రాములు, మహిపాల్ రెడ్డి, మంజుల, మేనేజ్ మెంట్ సభ్యులు, టీచర్లు, కావ్యశ్రీ తల్లిదండ్రులు మహేష్, పద్మావతి, అక్క కీర్తి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

