ప్ర‌శాతంగా కానిస్టేబుల్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌

కెరీర్ తాండూరు వికారాబాద్

ప్ర‌శాతంగా కానిస్టేబుల్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌
– గంట ముందే చేరుకున్న అభ్య‌ర్థులు
– ప‌రీక్షా కేంద్రాలు కిట కిట‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: పోలీసుశాఖలో ఖాళీల‌ను భ‌ర్తి చేసేందుకు ప్ర‌భుత్వం నిర్వ‌హించిన కానిస్టేబుల్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తాండూరులో ప్ర‌శాంతంగా ప్రారంభ‌మ‌య్యింది. ఆదివారం కానిస్టేబుల్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ను దృష్టిలో ఉంచుకుని తాండూరు ప‌ట్ట‌ణంతో పాటు మండ‌లాల్లోని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు విద్యాసంస్థ‌లలో మొత్తం 28 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ప‌రీక్ష‌లు రాసే అభ్య‌ర్థులు గంట ముందే కేంద్రాల‌కు చేరుకోవాల‌ని సూచించ‌డంతో అభ్య‌ర్థులు భారీ ఎత్తున ప‌రీక్షా కేంద్రాల‌కు చేరుకున్నారు.

అభ్య‌ర్థుల‌తో పాటు వెంట వ‌చ్చిన త‌ల్లిదండ్రులు, బందువుల‌తో ప‌రీక్షా కేంద్రాలు కిట‌కిట‌లాడాయి. అధికారులు సూచించిన విధంగానే అభ్య‌ర్థుల‌ను గంట ముందే కేంద్రాల‌లోకి అనుమ‌తించారు. ప‌రీక్షా రాసేందుకు హాజ‌రైన అభ్య‌ర్థులు హ‌ల్ టికెట్ నెంబ‌ర్ల‌ను చూసుకుని కేంద్రాల‌కు వెళ్లారు. ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద సూప‌ర్ వైజ‌ర్‌లు, అబ్జ‌ర్వ‌ర్లు అభ్య‌ర్థుల‌ను క్షుణ్ణంగా త‌నిఖీ చేసి లోప‌లికి అనుమ‌తించారు. ప‌రీక్షా కేంద్రాల‌ను వికారాబాద్ జిల్లా అఢిషన‌ల్ ఎస్పీ ర‌సీద్ సంద‌ర్శించి ప‌రిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల‌ని నిర్వ‌హ‌కుల‌ను ఆదేశించారు. మ‌రోవైపు కానిస్టేబుల్ ప్రిలిమిన‌రీ ప‌రీక్షా కేంద్రాల‌ను పోలీసు అధికారులు సంద‌ర్శించి త‌నిఖీలు చేశారు.