వైభవంగా హనుమాన్ పల్లకిసేవ
– దర్శించుకున్న మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ దంపతులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి సాయిపూర్‌లో హనుమాన్ పల్లకిసేవ వైభవంగా కొనసాగింది. శ్రావణమాసం ముగింపు, అమావాస్యను పురస్కరించుకుని సాయిపూర్‌లోని హనుమాన్ దేవాలయం ఆధ్వర్యంలో పల్లకిసేవ కార్యక్రమం నిర్వహించారు. ఆలయం నుంచి పలు వీదుల్లో పల్లకిసేవ ఊరేగింపు శోభాయామానంగా ముందుకు సాగింది.
ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రి దంపతులు, వారి కుమార్తెలు పల్లకిసేవ ఊరేగింపులో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయిపూర్‌కు చెందిన పెద్దలు, భక్తులు స్వామిని దర్శించుకున్నారు. పల్లకిసేవ ఊరేగింపు ముందు భక్తులు భజన కీర్తనలు ఆలాపిస్తూ ముందుకు సాగారు.
