భద్రేశ్వరాలయంలో రాజుగౌడ్కు సన్మానం
– గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పదవిపై హర్షం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులోని ప్రసిద్ద భావిగి భద్రేశ్వర దేవాయలంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్కు ఘన సత్కారం లభించింది. బుధవారం దేవాలయంలో ఈఓ శేఖర్ ఆధ్వర్యంలో రాజుగౌడ్ను సన్మానించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా రాజుగౌడ్ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రాజుగౌడ్ గ్రంథాలయ చైర్మన్ పదవికి వన్నె తీసుకరావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ సుమిత్ గౌడ్, టీఆర్ఎస్ ఉపాధ్యక్షులు హరిగౌడ్, నాయకులు వేణు గౌడ్, బబ్లు, ప్రశాంత్ కులకర్ణి, మధుసూదన్ గౌడ్, శివానంద్ తదితరులు పాల్గొన్నారు.


